Nirmal/Sarangapur (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 25
ఆషాఢ మాసంలో తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని సారంగాపూర్ మండలం ఆడెల్లి గ్రామంలోని లోటస్ అడ్వాన్స్ స్కూల్లో విద్యార్థినుల కోసం సంప్రదాయ గోరింటాకు సంబరాలు ఘనంగా నిర్వహించారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని పాఠశాల కరస్పాండెంట్ గోస్కుల ప్రవీణ్ తెలిపారు.
ఆషాఢ మాసంలోని తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని సారంగాపూర్ మండలం ఆడెల్లి గ్రామంలోని లోటస్ అడ్వాన్స్ స్కూల్లో విద్యార్థుల కోసం సంప్రదాయబద్ధంగా గోరింటాకు సంబరాలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొని అందమైన గోరింటాకు డిజైన్లను వేయించుకుని పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాల పట్ల విద్యార్థుల్లో అవగాహన పెంపొందించడంతో పాటు పండుగల విశిష్టతను తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు పాఠశాల కరస్పాండెంట్ గోస్కుల ప్రవీణ్ తెలిపారు.
పాఠశాల ప్రిన్సిపాల్ శిబూ జోసెఫ్ మాట్లాడుతూ, విద్యార్థులు విద్యతో పాటు భారతీయ సంస్కృతి, ఆచార వ్యవహారాలను తెలుసుకుని వాటిని ఆచరించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ రాజేశ్వర్, ఉపాధ్యాయులు రాథోడ్ రాము, రాజామణి, అర్చన, కావ్య, రాణి, వినీత, సరస్వతి, మంజుల, శిరీష, శశికళ, తిరుమల, సంధ్యారాణి, అఖిల పాల్గొని విద్యార్థులకు తొలి ఏకాదశి ప్రాముఖ్యతను వివరించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో విజయవంతంగా ముగిసింది.












