ఖానాపూర్, 2026-08-05
నిర్మల్ జిల్లా కడెం మండలంలోని ఉన్నత పాఠశాల లింగాపూర్ పాఠశాల ఆవరణలో ఆగస్టు 5, బుధవారం నాడు మెహందీ కార్యక్రమం ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాలలోని విద్యార్థినులు అందరూ ఒకరి చేతులకు మరొకరు మెహందీ పెట్టుకున్నారు.

ఆరోగ్య ప్రయోజనాలపై అవగాహన
పాఠశాలకు చెందిన మహిళా టీచర్లు మరియు విద్యార్థినులు ఒకరికొకరు మెహందీ వేసుకున్నారు. గోరింటాకు ప్రేమకు మరియు శుభానికి సూచన లాంటిదని, గోరింటాకు వేసుకోవడం వలన కలిగే ఆరోగ్య ఫలితాల గురించి విద్యార్థినులకు పీజీ హెడ్ మాస్టర్ శ్రీ బి.వెంకట రమణ అవగాహన కల్పించారు.
విద్యార్థుల ఆనందోత్సవాలు
కార్యక్రమం అనంతరం విద్యార్థులు ఆటలు మరియు పాటలతో ఆనందంగా గడిపారు. ఈ మెహందీ కార్యక్రమంలో పాఠశాలకు చెందిన మహిళా టీచర్లు ఎన్.శ్రీదేవి, కృష్ణవేణి, కళావతి, ఉషారాణి, జయంతి, స్వప్న, మిడ్ డే మీల్స్ మహిళా సిబ్బంది మరియు విద్యార్థినులు పాల్గొన్నారు.