తడ, 2 September
కుభీర్ మండలంలోని శివుని తండ 2 (సీతా భాయి తండ) గ్రామంలో శ్రీ జగదాంబ సేవాలాల్ దేవాలయ పునర్నిర్మాణ పనులకు దేవాదాయ ధర్మాదాయ శాఖ సీజీఎఫ్ నిధులు రూ.30 లక్షలతో శంకుస్థాపన జరిగింది. ముధోల్ శాసనసభ్యులు శ్రీ పవార్ రామారావు పటేల్ ముఖ్య అతిథిగా హాజరై పనులను ప్రారంభించారు.
*రూ.30 లక్షలతో జగదాంబ సేవాలాల్ ఆలయ పునర్నిర్మాణం*
*శివుని తండ 2 (సీతా భాయి తండ) లో ఘనంగా శంకుస్థాపన.. పాల్గొన్న ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ గారు..*
కుభీర్ మండలంలోని శివుని తండ 2 (సీతా భాయి తండ) లో గ్రామంలో శ్రీ జగదాంబ సేవాలాల్ దేవాలయ పునర్నిర్మాణ పనులకు ఘనంగా శంకుస్థాపన నిర్వహించారు.దేవాదాయ ధర్మాదాయ శాఖ సీజీఎఫ్ నిధులు రూ.30 లక్షలతో చేపట్టనున్న ఆలయ పునర్నిర్మాణ పనులకు ముధోల్ శాసనసభ్యులు శ్రీ పవార్ రామారావు పటేల్ గారు ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధికి సంబంధించిన వివరాలను తెలుసుకున్న ఎమ్మెల్యే, పనులను నాణ్యతా ప్రమాణాలతో త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.
శ్రీ జగదాంబ సేవాలాల్ దేవాలయం బంజారా సమాజానికి ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాధాన్యత కలిగిన ఆలయమని, ఆలయ పునర్నిర్మాణానికి రూ.30 లక్షల నిధులు మంజూరు కావడం సంతోషకరమని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ గారు అన్నారు. ఆలయ అభివృద్ధితో భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.
*గ్రామ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లిన ప్రజలు*
శంకుస్థాపన కార్యక్రమానికి హాజరైన గ్రామస్తులు తమ గ్రామంలో నెలకొన్న పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా రహదారి, మొబైల్ నెట్వర్క్, త్రీ ఫేస్ విద్యుత్, తాగునీరు, భూముల పట్టాలు, కుల ధ్రువీకరణ పత్రాలు, రేషన్ బియ్యం వంటి సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
గ్రామస్తుల విజ్ఞప్తిపై స్పందించిన ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్, వీరేగం తండ నుంచి శివుని తండ వరకు సుమారు మూడు కిలోమీటర్ల రహదారి నిర్మాణాన్ని త్వరలో పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గ్రామంలో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయిస్తామని తెలిపారు.
వ్యవసాయానికి అవసరమైన త్రీ ఫేస్ విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు సంబంధిత అధికారులను గ్రామానికి పంపించి పరిస్థితిని పరిశీలిస్తామని, అనంతరం అవసరమైన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
*నెట్వర్క్ సమస్య పరిష్కారానికి కృషి...*
శివుని తండలో మొబైల్ నెట్వర్క్ సౌకర్యం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గ్రామస్తులు తెలిపారు. దీనిపై ఎమ్మెల్యే స్పందిస్తూ బీఎస్ఎన్ఎల్ అధికారులతో మాట్లాడి గ్రామంలో బీఎస్ఎన్ఎల్ టవర్ మంజూరయ్యేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
*రేషన్ బియ్యం గ్రామంలోనే అందించేలా చర్యలు....*












