భైంసా, 2023-09-02
భైంసా పట్టణంలోని గణేష్‌నగర్ మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో రామాయణ, భాగవత పారాయణ కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలకు మహిళలు, పురుషులు పెద్ద సంఖ్యలో హాజరై పాల్గొంటున్నారు.
భక్తిశ్రద్ధలతో రామాయణ, భాగవత పారాయణం
గణేష్‌నగర్ మున్నూరు కాపు సంఘంలో ప్రతిరోజూ ప్రత్యేక పూజలు
భైంసా, సెప్టెంబరు 2: భైంసా పట్టణంలోని గణేష్‌నగర్ మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో రామాయణం, భాగవత పారాయణ కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమాలకు మహిళలు, పురుషులు పెద్ద సంఖ్యలో హాజరై పారాయణంలో పాల్గొంటున్నారు.
మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు తోట రాము ఆధ్వర్యంలో కార్యవర్గ సభ్యులు ప్రతిరోజూ ప్రత్యేక పూజలు, హారతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేస్తున్నారు.
శ్రీ సరస్వతి శిశు మందిర్ ఆచార్యులు ప్రవీణ్ రామాయణం, భాగవతంలోని విశేషాలను భక్తులకు వివరిస్తూ పారాయణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు.
ఈ సందర్భంగా గురువారం రాత్రి శ్రీకృష్ణాష్టమి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు మున్నూరు కాపు సంఘం ప్రతినిధులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై వేడుకలను విజయవంతం చేయాలని వారు కోరారు.












