ఖానాపూర్, జూలై 30
ఖానాపూర్ పట్టణంలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు కాలనీలు వరద ముంపునకు గురయ్యాయి. ఈ నేపథ్యంలో, నిర్మల్ జిల్లా డీసీసీ ఉపాధ్యక్షులు, ఖానాపూర్ మాజీ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం వరద ప్రభావిత ప్రాంతాలను కాలనీ వాసులతో కలిసి సందర్శించి, సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఖానాపూర్ పట్టణంలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు కాలనీలలో వరద ముప్పు ఉన్న ప్రాంతాలను నిర్మల్ జిల్లా డీసీసీ ఉపాధ్యక్షులు, ఖానాపూర్ మాజీ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం కాలనీ వాసులతో కలిసి ఈరోజు సందర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిన్న రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాల వల్ల పలు కాలనీలలోకి వరద నీరు వచ్చి ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వెళ్లే పరిస్థితి లేకుండా పోయిందని తెలిపారు. జేసీబీ సహాయంతో వరద నీటిని దిగువ ప్రాంతానికి పంపించి కాలనీవాసులకు ఇబ్బంది లేకుండా చేశామని చెప్పారు. ఎక్కడైనా సమస్య ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని, సమస్యను పరిష్కరిస్తామని, ప్రజాసేవ చేయడానికి తామున్నామని అన్నారు.
భారీ వర్షాన్ని కూడా లెక్కచేయకుండా, కాలనీవాసులు చెప్పగానే వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించిన సత్యం అన్నకు కాలనీవాసులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.












