మిర్యాలగూడ, జూలై 6
మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రాం వర్ధంతి సందర్భంగా మిర్యాలగూడలో దళిత నాయకులు ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ నెల 14న హైదరాబాద్ లో జరగనున్న సంఘం గోల్డెన్ జూబ్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రాం వర్ధంతి సందర్భంగా మిర్యాలగూడ పట్టణంలోని 35, 18 వార్డుల కౌన్సిలర్లు దైద సోమసుందర్, బూడిద సైదులు, అంబేద్కర్ యువజన సంఘం నాయకులు కత్తుల సూర్యనారాయణ, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ పెరుమాల్ల బాలస్వామి, జిల్లా అధ్యక్షుడు కొండేటి వెంకట్, గుడుపూరి శ్రీనివాస్, ఆర్కే, టీఎమ్మార్పిఎస్ జిల్లా అధ్యక్షులు మొండికత్తి లింగయ్య, ఉబ్బపల్లి భాస్కర్ లు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు.
ఈ నెల 14న హైదరాబాద్ లో జరగనున్న సంఘం గోల్డెన్ జూబ్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.











