బైంసా (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 23
బైంసా మండలంలోని దేగాం, బిజ్జూర్, లింగా గ్రామాల్లో పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ ప్రారంభించారు. గ్రామాలను దశలవారీగా అభివృద్ధి చేయడమే తన ధ్యేయమని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో గ్రామాలకు భారీగా నిధులు మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు.
దశలవారీగా గ్రామాలను అభివృద్ధి చేయడమే తన ధ్యేయమని ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ అన్నారు. బైంసా మండలంలోని దేగాం గ్రామంలో 7 లక్షల రూపాయల నిధులతో నిర్మించిన పాఠశాల ప్రహరీ గోడ, బిజ్జూర్, లింగా గ్రామాల్లో ఒక్కోటి పది లక్షల రూపాయల నిధులతో నిర్మించిన మహిళా సమైక్య భవనాలను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో ఉపాధి హామీ పథకంలో భాగంగా సిసి రోడ్లు, గోదాముల నిర్మాణం, మహిళా సమైక్య భవనాల నిర్మాణం, పలు అభివృద్ధి పనులకు ఒక్కో గ్రామానికి 50 లక్షల రూపాయల నుంచి కోటి రూపాయలకు పైగా నిధులు మంజూరు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రామాల్లో అభివృద్ధి పనులు జరగడం సంతోషంగా ఉందని అన్నారు. పది సంవత్సరాల పాలకుల కాలంలో నియోజకవర్గం అన్ని రంగాల్లో వెనుకబడిందని, దశలవారీగా గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
బైంసా మండలంలోని దేగాం గ్రామంలో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే జెడ్పి హైస్కూల్ విద్యార్థులతో కాసేపు గడిపారు. విద్యార్థులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. పాఠశాలలోని సమస్యలను అడిగి తెలుసుకుని, తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు.
బైంసా మండలంలోని లింగా గ్రామంలో జలసిరి కార్యక్రమాన్ని ప్రారంభించి, నీటి కుంట నిర్మాణాన్ని చేపట్టారు. వర్షాభావ పరిస్థితులు తలెత్తిన నేపథ్యంలో వి.బి. రాంజీ పథకంలో నీటి కుంటలు, ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టాలని సూచించారు. ప్రారంభోత్సవ కార్యక్రమాలకు హాజరైన ఎమ్మెల్యేకు మహిళలు డప్పు చప్పులతో, పూలు చల్లుతూ ఘనస్వాగతం పలికారు.
ఈ కార్యక్రమాల్లో డి.ఆర్.డి.ఓ. పి.డి. విజయలక్ష్మి, ఎం.పి.డి.ఓ. నీరజ్ కుమార్, సీనియర్ నాయకులు సోలంకి భీమ్రావు, మాజీ ఎం.పి.పి. అబ్దుల్ రజాక్, సర్పంచుల సంఘం బైంసా మండల అధ్యక్షులు పండిత్ రావు పటేల్, బిజెపి మండల అధ్యక్షులు, దేగాం సర్పంచ్ సిరం సుష్మ రెడ్డి, స్థానిక సర్పంచులు లక్ష్మీ వెంకట్ రెడ్డి, లింగా సర్పంచ్ గడపాలే సుష్మ రాణి యశ్వంత్, ఆయా గ్రామాల సర్పంచులు, బిజెపి నాయకులు, మాజీ ఎం.పి.టి.సి.లు తదితరులు పాల్గొన్నారు.












