అమరావతి, జులై 23
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో జరిగిన మంత్రివర్గ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్ర నిరుద్యోగులకు ఊరటనిస్తూ 3,168 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. చేనేత కార్మికులకు నేతన్న భరోసా కింద రూ.25 వేల ఆర్థిక సాయం కూడా ప్రకటించారు.
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన గురువారం వెలగపూడిలోని సచివాలయంలో జరిగిన మంత్రివర్గ భేటీలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఊరటనిస్తూ.. 3,168 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి క్యాబినెట్ గురువారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి పచ్చజెండా ఊపిన కేబినెట్, అదేవిధంగా చేనేత కార్మికులకు ‘నేతన్న భరోసా’ పథకం కింద ఒక్కొక్కరికి రూ.25 వేల ఆర్థిక సాయం అందించేందుకు నిర్ణయం తీసుకుంది.
అలాగే బాపట్లలో వినికిడి లోపం ఉన్న విద్యార్థుల కోసం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు, గోదావరి పుష్కరాల భద్రతా ఏర్పాట్ల కోసం రూ.50 కోట్లు మంజూరు, ఏపీ మార్క్‌ఫెడ్‌కు సెంట్రల్ బ్యాంక్ నుంచి లభించే రూ.300 కోట్ల రుణానికి రాష్ట్ర ప్రభుత్వ గ్యారెంటీ ఇవ్వడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.











