ఆర్మూర్, జులై 16
ఆర్మూర్ లోని నూతన పట్టు చేనేత సహకార సంఘం చైర్మన్ గా గంగా మోహన్ చక్రు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సన్మాన కార్యక్రమంలో ఆయన సంఘం అభివృద్ధికి, నేత కార్మికుల ఉపాధికి కృషి చేస్తానని తెలిపారు.
ఆర్మూర్: నూతన పట్టు చేనేత సహకార సంఘం చైర్మన్ గా గంగా మోహన్ చక్రు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా జిరాయత్ నగర్ హనుమాన్ మందిర కమిటీ అధ్యక్షులు అంబల్ల తిరుపతి, కార్యదర్శి నూకల శేఖర్, కోశాధికారి నవీన్ ల ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన చైర్మన్ బొచ్కర్ కోలు గంగమోహన్ చక్రు, సెక్రటరీ బొచ్కార్ లక్ష్మీనారాయణ, డైరెక్టర్లు ఖాందేశ్ సత్యం, వంగ ఆనంద్ కృష్ణలను ఘనంగా సన్మానించారు. వారికి పూలమాలలు, శాలువాలు కప్పి గౌరవించారు.
ఈ కార్యక్రమంలో గంగా మోహన్ చక్రు మాట్లాడుతూ, పట్టు చేనేత సహకార సంఘాన్ని మరింత అభివృద్ధి చేస్తానని, నేత పనివారికి ఉపాధి కల్పించే దిశగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో రూపాలి నర్సయ్య, కోలు దత్తద్రి, విట్టోబ శేఖర్, స్వామి యాదవ్, మానకొండూర్ భాస్కర్, రవీందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.












