తెలంగాణ రాష్ట్ర డీజీపీ సి.వి. ఆనంద్ ఐపీఎస్‌ను నిర్మల్ జిల్లాకు వచ్చిన సందర్భంగా ఘన స్వాగతం లభించింది.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ఐఏఎస్, జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల ఐపీఎస్ సంయుక్తంగా డీజీపీ సి.వి. ఆనంద్‌కు పుష్పగుచ్ఛం అందజేశారు.
డీజీపీ సి.వి. ఆనంద్ వెంట వచ్చిన ఉమెన్ సేఫ్టీ, సిఐడి, ఏసీబీ డీజీపీ చారు సిన్హా ఐపీఎస్, మల్టీ జోన్ ఐజి చంద్రశేఖర్ ఐపీఎస్‌లకు కూడా పుష్పగుచ్ఛాలు అందజేసి సాదరంగా ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ అడ్మిన్ ఉపేందర్ రెడ్డి, భైంసా ఏఎస్పీ సాయికిరణ్ ఐపీఎస్, నిర్మల్ డీఎస్పీ శ్రీనివాస్, ఏఓ యూనస్ అలీ, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.
డీజీపీ సి.వి. ఆనంద్ తొలిసారి నిర్మల్ జిల్లాకు రావడం జిల్లా పోలీసు యంత్రాంగానికి ఉత్సాహాన్నినింపింది.











