హైదరాబాద్, జులై 30
ఢీఇడగ(6e717)హైబఖడడశషబఎడగఅడ.ై229షగబడడ.
ఢిల్లీ నుంచి ఇండిగో (6e717) విమానంలో హైదరాబాద్‌కు చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విమానం ల్యాండింగ్‌కు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీఎఫ్) నుంచి అవసరమైన క్లియరెన్స్ అందలేదు.
దీంతో పైలట్ విమానాన్ని రన్‌వేపై ల్యాండింగ్ చేస్తున్నట్లుగా చేసి, వెంటనే తిరిగి గాల్లోకి తీసుకెళ్లాల్సి వచ్చింది. సుమారు 20 నిమిషాల పాటు విమానం గాల్లోనే చక్కర్లు కొట్టింది. రాత్రి 8:30 గంటలకు విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఆ సమయంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు విమానంలో మొత్తం 229 మంది ప్రయాణికులు ఉన్నారు. ఏం జరుగుతుందో తెలియక కాసేపు సెక్యూరిటీ అధికారులు కూడా ఆందోళనకు గురయ్యారు.












