బోథ్ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 24
ప్రతి ఇంటికీ ఇంకుడు గుంత నిర్మించుకోవడం ద్వారా భూగర్భ జలాలను పెంచుకోవచ్చని సోనాల ఎంపీడీవో రత్నాకర్ రావు సూచించారు. శుక్రవారం ఘన్పూర్ డివిటి గ్రామాల్లో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ మేరకు పిలుపునిచ్చారు. భవిష్యత్తులో నీటి ఎద్దడిని ఎదుర్కోకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆయన గ్రామస్తులకు సూచించారు.
ప్రతి ఇంటికీ ఇంకుడు గుంత నిర్మించుకోవాలని, తద్వారా భూగర్భ జలాలు పెరుగుతాయని సోనాల ఎంపీడీవో రత్నాకర్ రావు పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని ఘన్పూర్ డివిటి గ్రామాలలో గ్రామస్తులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వర్షాభావ పరిస్థితుల వల్ల భవిష్యత్తులో నీటి ఎద్దడి రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టినట్లయితే బోరు బావులలో నీటిమట్టం తగ్గకుండా ఉంటుందన్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన చెరువులను పూర్తి చేసుకోవాలని ఆయన సూచించారు. వృధాగా పోయే నీటిని భూమిలో ఇంకే విధంగా చూడాలని కోరారు.
ఆయా గ్రామాలలో న్యూట్రి గార్డెన్లో మునగ మొక్కలను నాటారు. అలాగే, ఆయా పాఠశాలల్లో పారిశుద్ధ్య పనులను పరిరక్షించారు. సమావేశంలో ఆయా గ్రామాల ప్రజలతోపాటు సర్పంచులు, గ్రామ కార్యదర్శులు పాల్గొన్నారు.












