(కే) (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 16
నిర్మల్ జిల్లా బాసర మండలం కిర్గుల్ (కే) గ్రామంలో గురువారం సీఐ దీపక్, గ్రామ సర్పంచ్ మధు ప్రీతి ఆధ్వర్యంలో గ్రామస్తులు కలిసి పలు రకాల పూల మొక్కలను విస్తృతంగా నాటారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతిజ్ఞ చేశారు.
నిర్మల్ జిల్లా బాసర మండలం కిర్గుల్ (కే) గ్రామంలో గురువారం సీఐ దీపక్, గ్రామ సర్పంచ్ మధు ప్రీతి ఆధ్వర్యంలో గ్రామస్తులు కలిసి విస్తృతంగా పలు రకాల పూల మొక్కలను నాటారు.
ఈ సందర్భంగా సీఐ దీపక్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించడం తమ సామాజిక బాధ్యతగా భావించాలని సూచించారు. మొక్కలు నాటడం ద్వారా పర్యావరణ సమతుల్యతను కాపాడటంతో పాటు భావితరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించవచ్చని తెలిపారు.
సర్పంచ్ మధు ప్రీతి మాట్లాడుతూ, గ్రామాన్ని మరింత పచ్చదనంతో తీర్చిదిద్దేందుకు ప్రజలందరూ మొక్కల పెంపకంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
అనంతరం గ్రామస్తులంతా మొక్కలను సంరక్షిస్తామని ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.












