ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా (కె) గ్రామంలో నిర్వహిస్తున్న అఖండ హరినామ సప్తా మహోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ పాల్గొన్నారు. గ్రామస్తుల ఆహ్వానం మేరకు ఆయన హాజరై కుంకుమ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన హరినామ కీర్తనల్లో గ్రామస్థులు భక్తి శ్రద్ధలతో పాల్గొని భజనలు చేశారు. కార్యక్రమానికి విచ్చేసిన బలరాం జాదవ్‌ను గ్రామస్తులు శాలువాతో సన్మానించి అభినందించారు.
అనంతరం, ముక్రా (బి) గ్రామ సమీపంలో సంజీవ్ ఖేర్‌కు చెందిన చేనులో నిర్మాణంలో ఉన్న రాధా-కృష్ణ ఆలయాన్ని బలరాం జాదవ్ సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, భక్తులు, యువకులు పాల్గొన్నారు.












