భైంసా పట్టణం, బైంసా (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 03
బైంసా పట్టణంలోని రామ్ లీలా మైదానంలో శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా హిందూ వాహిని మహిషా శాఖ ఆధ్వర్యంలో ఆటల పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో విజేతలకు ముధోల్ శాసనసభ్యులు పవార్ రామారావు పటేల్ బహుమతులు అందజేశారు.
*రామ్ లీలా మైదానంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు..* *విజేతలకు బహుమతులు అందజేసిన ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ .* బైంసా భైంసా పట్టణంలోని రామ్ లీలా మైదానంలో శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకొని హిందూ వాహిని మహిషా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆటల పోటీలు ఉత్సాహంగా సాగాయి. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచి విజయం సాధించిన క్రీడాకారులకు ముధోల్ శాసనసభ్యులు పవార్ రామారావు పటేల్ బహుమతులను ప్రదానం చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. క్రీడల్లో గెలుపోటములు సహజమని, క్రీడల వల్ల యువతలో మానసిక, శారీరక దృఢత్వం పెంపొందుతుందని అన్నారు. యువత క్రీడలపై ఆసక్తి పెంచుకొని రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. అనంతరం నూతనంగా మంజూరైన శ్రీరామ మందిర నిర్మాణానికి సంబంధించిన టెండర్ ప్రక్రియ పూర్తయిందని సభా వేదికగా ఎమ్మెల్యే వెల్లడించారు. అనంతరం ఆలయ నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు, హిందూ వాహిని నాయకులు, కార్యకర్తలు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.












