Karim Colony, Khanapur, Mancherial, Telangana (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 03
ఖానాపూర్ మున్సిపల్ 5వ వార్డు పరిధిలోని కరీం కాలనీలో బోరు మోటార్ చెడిపోవడంతో స్థానిక నీటి సమస్య ఏర్పడింది. వార్డు కౌన్సిలర్ మేష పోచమ్మ సతీష్ వెంటనే స్పందించి, గురువారం మోటార్‌ను మరమ్మతు చేయించి కాలనీ వాసుల సమస్యను పరిష్కరించారు.
కరీం కాలనీలో బోరు మోటార్ మరమ్మతు ఖానాపూర్, సెప్టెంబర్ 3 ( ఖానాపూర్ మున్సిపల్ 5వ వార్డు పరిధిలోని కరీం కాలనీలో బోరు మోటార్ చెడిపోవడంతో వార్డు కౌన్సిలర్ మేష పోచమ్మ సతీష్ వెంటనే స్పందించారు. గురువారం మోటార్‌ను మరమ్మతు చేయించి కాలనీ వాసుల నీటి సమస్యను పరిష్కరించారు.బోరు మోటార్ పనిచేయక ఇబ్బందులు పడుతున్న విషయం తెలుసుకున్న కౌన్సిలర్ సతీష్ సంబంధిత సిబ్బందితో మాట్లాడి మరమ్మతు పనులు చేపట్టించారు. మోటార్ తిరిగి పనిచేయడంతో కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేసి కౌన్సిలర్‌ను అభినందించారు.ఈ కార్యక్రమంలో వాసేఖాన్, ఫైసల్, అత్తవుళ్ల రాహిల్, శిరీష్, సుమీర్, మున్సిపల్ సిబ్బంది జావిద్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.











