నర్సాపూర్, 3 September
నర్సాపూర్ మండలం బామ్ని గ్రామ మాజీ సర్పంచ్ దత్తూరం ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఈ నేపథ్యంలో మోహన్రావు ప్రజా ట్రస్ట్ చైర్మన్, బీజేపీ సీనియర్ నాయకులు భోస్లే మోహన్రావు పాటిల్ గురువారం ఆయన నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
మాజీ సర్పంచ్ దత్తూరం కుటుంబాన్ని పరామర్శించిన భోస్లే మోహన్రావు పాటిల్ నర్సాపూర్, సెప్టెంబర్ 3 ( మండలం బామ్ని గ్రామ మాజీ సర్పంచ్ దత్తూరం ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడంతో మోహన్రావు ప్రజా ట్రస్ట్ చైర్మన్, బీజేపీ సీనియర్ నాయకులు భోస్లే మోహన్రావు పాటిల్ గురువారం ఆయన నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా మృతికి గల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, ఈ కష్ట సమయంలో మనోధైర్యంతో ఉండాలని సూచించారు. మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సుభాష్ జాదవ్, సుదర్శన్, దత్తసాయి, గుద్దేటి నర్సయ్య, రాములు, అయిండ్ల ముత్యం రెడ్డి తదితరులతో పాటు గ్రామ కార్యకర్తలు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.











