నిజామాబాద్, జూన్ 28
జాతీయ మానవ హక్కుల కమిషన్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు మాల్వేకర్ ధర్మేంద్ర ఆధ్వర్యంలో శివాజీ నగర్లోని ఐటీఐలో పల్స్ పోలియో కార్యక్రమం ఘనంగా జరిగింది. ఐదేళ్లలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయడం ద్వారా అంగవైకల్యాన్ని నివారించవచ్చని ఈ సందర్భంగా ధర్మేంద్ర తెలిపారు.
జాతీయ మానవ హక్కుల కమిటీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు మాల్వేకర్ ధర్మేంద్ర ఆధ్వర్యంలో శివాజీ నగర్లోని ఐటీఐలో పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ధర్మేంద్ర మాట్లాడుతూ ఐదు సంవత్సరాలు నిండిన ప్రతి చిన్నారికి పల్స్ పోలియో చుక్కల మందు ఎంతో అవసరమని తెలిపారు. చిన్నారులకు పోలియో చుక్కలు వేయడం ద్వారా భవిష్యత్తులో అంగవైకల్యం రాకుండా కాపాడుకోవచ్చని అన్నారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పల్స్ పోలియో కార్యక్రమంలోని చుక్కల మందు చిన్నారుల ఆరోగ్యానికి అమృతంలా పనిచేస్తుందని ధర్మేంద్ర పేర్కొన్నారు. పిల్లల ఆరోగ్య పరిరక్షణతో పాటు వారి భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.
పల్స్ పోలియో కార్యక్రమానికి స్వచ్ఛందంగా హాజరై తమ పిల్లలకు చుక్కల మందు వేయిస్తున్న తల్లిదండ్రులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కృపాల్ సింగ్, సుశీల, ధర్మేందర్, చండాలియా నరేందర్ తదితరులు పాల్గొన్నారు.












