బోయినిపల్లి (మనోరంజని తెలుగు టైమ్స్) జూన్ 28
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం విలాసాగర్ గ్రామంలో పల్స్ పోలియో 2026 కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ ఏనుగుల కనకయ్య, ఉప సర్పంచ్ పొత్తూరి శైలజ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో, 0-5 ఏళ్ల లోపు పిల్లలకు పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలని సర్పంచ్ సూచించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం విలాసాగర్ గ్రామంలో పల్స్ పోలియో 2026 కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ ఏనుగుల కనకయ్య, ఉప సర్పంచ్ పొత్తూరి శైలజ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా సర్పంచ్ ఏనుగుల కనకయ్య మాట్లాడుతూ 0-5 సంవత్సరాల లోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. పోలియో వంటి ప్రాణాంతక వ్యాధి నుంచి చిన్నారులను రక్షించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు.
"రెండు చుక్కలు వేయండి... మీ పిల్లల భవిష్యత్తును రక్షించండి. పోలియో రహిత భారత్ కోసం మనమంతా కలిసి ముందుకు సాగుదాం" అని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు పోలే శేఖర్, యువజన కాంగ్రెస్ నాయకులు ఏనుగుల ప్రశాంత్, పీహెచ్సీ వైద్యులు, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు, గ్రామ కార్యదర్శి శేఖర్, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.











