హైదరాబాద్, 1 August
ముధోల్ నియోజకవర్గ మున్నూరుకాపు సంఘం అధ్యక్షులు రోళ్ళ రమేష్ ఇటీవల గుండె సంబంధిత సమస్యతో హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొంది, డిశ్చార్జ్ అయ్యారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర మున్నూరుకాపు సంఘం అధ్యక్షులు పుటం పురుషోత్తం ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు.
ముధోల్ నియోజకవర్గ మున్నూరుకాపు సంఘం అధ్యక్షులు రోళ్ళ రమేష్ ఇటీవల గుండె సంబంధిత సమస్యతో హైదరాబాద్ హైటెక్ సిటీలోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందారు.
వైద్యులు పరీక్షలు నిర్వహించగా గుండెకు సంబంధించిన రెండు వాల్వులు బ్లాక్ అయినట్లు గుర్తించి, వాటికి స్టంట్లు అమర్చారు. అనంతరం రోళ్ళ రమేష్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర మున్నూరుకాపు సంఘం అధ్యక్షులు పుటం పురుషోత్తం హైదరాబాద్ గచ్చిబౌలిలోని రోళ్ళ రమేష్ నివాసానికి వెళ్లి ఆయనను పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని ఆయన కుమారుడు రోళ్ళ మనోహర్‌ను అడిగి తెలుసుకున్నారు.
రోళ్ళ రమేష్‌ను ప్రాణాపాయం నుంచి కాపాడిన భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపుతూ, ఆయన త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో పలువురు కుల పెద్దలు పాల్గొన్నారు.












