శ్రీ వేద మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ లో భారీ కణితినివిజయవంతంగా శస్త్రచికిత్సతో తొలగింపు :
👉 డాక్టర్ జగన్ రెడ్డి
మిర్యాలగూడ, జూలై 30 (మనోరంజని తెలుగు టైమ్స్)
మిర్యాలగూడలోని శ్రీ వేద మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు అత్యంత అరుదైన భారీ ఓవేరియన్ సిస్టాడెనోమా కణితిని విజయవంతంగా శస్త్రచికిత్స ద్వారా తొలగించి నట్లు ఆసుపత్రి యండి డాక్టర్ అలుగుబెల్లి జగన్ రెడ్డి శుక్రవారం తెలిపారు.
స్థానికంగా ఆసుపత్రిలో ఏర్పాటుచేసినవిలేకరుల సమావేశంలోఆయన వివరాలు వెల్లడించారు. త్రిపురారం మండల కేంద్రానికి చెందిన రొయ్య పద్మ 45 సంవత్సరాల మహిళ పొత్తికడుపుఅసాధారణంగా పెరగడం, నొప్పి, అసౌకర్యం వంటి సమస్యలతో ఆసుపత్రికి వచ్చింది. ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించి కడుపులో కణితి ఉన్నట్లుగా గుర్తించారు. పరీక్షల్లో అండాశయంలో 26 సెంటీమీటర్ల పరిమాణం,సుమారు 5 కిలోల బరువు కలిగిన భారీ కణితి ఉన్నట్లు గుర్తించామన్నారు.ఈ క్లిష్టమైన శస్త్రచికిత్సను జనరల్ సర్జన్ డాక్టర్ రాంబాబువిజయవంతంగా నిర్వహించారు. శస్త్రచికిత్స సమయంలో అనస్థీషియా నిపుణురాలు డాక్టర్ దాక్షిణ్య రెడ్డి మత్తు వైద్య సేవలు అందించగా డాక్టర్ జగన్ రెడ్డి రోగి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తూ వైద్య సహకారం అందించారు. వైద్య బృందంసమన్వయంతో కణితిని పూర్తిగా తొలగించగా, ప్రస్తుతం రోగి ఆరోగ్యంగా కోలుకుంటున్నారు.
డాక్టర్ అలుగుబెల్లి జగన్ రెడ్డిమాట్లాడుతూ ఇంత పెద్దపరిమాణంలో ఉన్న ఓవేరియన్ సిస్టాడెనోమా కేసులు ప్రస్తుతం చాలా అరుదుగాకనిపిస్తున్నాయి. సరైన సమయంలో గుర్తించి శస్త్రచికిత్స చేయడం వల్ల రోగి పూర్తిగా కోలుకునే అవకాశంఉంటుందన్నారు.శ్రీవేదమల్టీస్పెషాలిటీ హాస్పిటల్లోఅత్యాధునికవైద్యసదుపాయాలు,అనుభవజ్ఞులైన వైద్య బృందం సహకారంతో క్లిష్టమైనశస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహిస్తున్నామని ఆసుపత్రియాజమాన్యం పేర్కొన్నారు.












