బోథ్ (మనోరంజని తెలుగు టైమ్స్) జూన్ 28
పిల్లలకు ఐదు సంవత్సరాల వయస్సు వరకు పల్స్ పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలని, ఇవి జీవితాంతం రక్షణ కల్పిస్తాయని కుచ్లాపూర్ గ్రామ సర్పంచ్ మైలి నారాయణ అన్నారు. పోలియో రహిత దేశంగా భారతదేశాన్ని తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం కొనసాగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు పుట్టినప్పటి నుండి ఐదు సంవత్సరాల వయస్సు వరకు పల్స్ పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలని కుచ్లాపూర్ గ్రామ సర్పంచ్ మైలి నారాయణ సూచించారు. పల్స్ పోలియో చుక్కలు చిన్నారులకు జీవితాంతం రక్షణగా నిలుస్తాయని, బంగారు భవిష్యత్తుకు తోడ్పడతాయని ఆయన అన్నారు. పోలియో రహిత దేశంగా భారతదేశాన్ని మార్చడమే లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
కుచ్లాపూర్ గ్రామంలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో సర్పంచ్ మైలి నారాయణతో పాటు ఉప సర్పంచ్ సుద్దుల అరుణ్ రెడ్డి, వార్డు సభ్యులు ననిగంటి లక్ష్మారెడ్డి, భోజన్న అశోక్, ఆరోగ్య శాఖ సిబ్బంది తక్కల్ల వేణి, అంగన్వాడి టీచర్ కళావతి, ఆయా లక్ష్మి, ఆశ వర్కర్లు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.











