చిలుకూరిఅభిరామ్ పుట్టినరోజు వేడుకలు.. అల్పాహారం,పండు పంపిణీచేసిన చైర్ పర్సన్ సుధా బాలకృష్ణ
మిర్యాలగూడ ఆగస్టు 01 (మనోరంజని తెలుగు టైమ్స్)
లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ ఆధ్వర్యంలో మిర్యాలగూడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ప్రతిరోజు నిర్వహిస్తున్న ఉచిత అల్పాహార వితరణ కార్యక్రమంలో శనివారం మిర్యాలగూడ మున్సిపల్ చైర్ పర్సన్ చిలుకూరి సుధా బాలకృష్ణ ల తనయుడు చిలుకూరి అభిరామ్, నాయనమ్మ మాజీ కౌన్సిలర్ చిలుకూరి సక్కుబాయమ్మ ల పుట్టినరోజు వేడుకలు సందర్భంగా డిసిసి ప్రధాన కార్యదర్శి చిలుకూరి బాలకృష్ణ దాతృత్వంతో ఏరియా ఆసుపత్రి రోగులకు పండ్లను చైర్ పర్సన్ సుధా బాలకృష్ణ పంపిణీ చేశారు. అదేవిధంగా ఏరియా ఆసుపత్రికి ప్రతిరోజు పెద్ద సంఖ్యలో రోగుల వెంట తరలివచ్చే సహాయకులకు అల్పాహార వితరణ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వర్షిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చైర్మన్, లయన్స్ క్లబ్ అధ్యక్షులు కుటాలరాంబాబు,సెక్రెటరీ .మేరెడ్డి సత్యనారాయణ రెడ్డి,తుమ్మల ఫణి కుమార్,యనగండ్ల లింగయ్య, బియం. నాయుడు,భాస్కర క్లబ్ సీనియర్ లయన్ లీడర్స్ ఏచూరి మురహరి,విజయ్ కుమార్, దిద్దకుంట్ల శంకర్ రెడ్డి, కర్ర రాంరెడ్డి, వంగాల లక్ష్మారెడ్డి, గట్టు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.












