నిర్మల్, జులై 31
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హెల్త్ కమిషనర్ ఉత్తర్వుల మేరకు నిర్మల్ జిల్లా మాతా శిశు సంరక్షణ (MCH) ప్రాసవ ఆసుపత్రిలో శుక్రవారం శానిటేషన్ (పరిశుభ్రత) పై ప్రత్యేక సమీక్ష, తనిఖీ కార్యక్రమం నిర్వహించారు. ఆసుపత్రి పరిసరాలు, వార్డులలో పారిశుధ్య నిర్వహణను అధికారుల బృందం క్షుణ్ణంగా పరిశీలించింది.
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హెల్త్ కమిషనర్ ఉత్తర్వుల మేరకు నిర్మల్ జిల్లా మాతా శిశు సంరక్షణ (MCH) ప్రాసవ ఆసుపత్రిలో శుక్రవారం శానిటేషన్ (పరిశుభ్రత) పై ప్రత్యేక సమీక్ష, తనిఖీ కార్యక్రమం నిర్వహించారు.
ఆసుపత్రి పరిసరాలు, వార్డులలో పారిశుధ్య నిర్వహణను అధికారుల బృందం క్షుణ్ణంగా పరిశీలించింది. రోగులకు, గర్భిణులకు మెరుగైన, ఆరోగ్యకరమైన వాతావరణం అందించడమే లక్ష్యంగా ఈ రివ్యూ చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
వార్డులు, ఆపరేషన్ థియేటర్లు, డెలివరీ రూమ్లు మరియు టాయిలెట్ల వద్ద పరిశుభ్రత ప్రమాణాలను పరిశీలించారు. పారిశుధ్య సిబ్బంది క్రమం తప్పకుండా చెత్తను తొలగించాలని, ఇన్ఫెక్షన్లు వ్యాపించకుండా నివారణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆసుపత్రికి వచ్చే తల్లులకు, పసిపిల్లలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని, నీటి సరఫరా మరియు డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా ఉండేలా చూడాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో RMO Dr. సివిల్ సర్జన్ రమేష్, ఆసుపత్రి నర్సింగ్ సూపరింటెండెంట్ ధనలక్ష్మి, వైద్యులు మరియు శానిటేషన్ సూపర్వైజర్ కాంతి, విభాగ సిబ్బంది పాల్గొన్నారు.












