కడం (పెద్దూర్), ఈరోజు
కొండూకూర్ ప్రభుత్వ పాఠశాలలో ఈరోజు విద్యార్థులకు నులిపురుగుల నివారణ మందుల పంపిణీ కార్యక్రమం జరిగింది. సర్పంచ్ శ్రీ భీమేష్, ఉప సర్పంచ్ ఫోరం జిల్లా అధ్యక్షులు శ్రీ పొద్దుటూరి సంపత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం విజయవంతంగా పూర్తయింది.
కొండూకూర్ ప్రభుత్వ పాఠశాలలో ఈరోజు విద్యార్థులకు నులిపురుగుల నివారణ మందుల పంపిణీ కార్యక్రమం జరిగింది.
సర్పంచ్ శ్రీ భీమేష్, ఉప సర్పంచ్ ఫోరం జిల్లా అధ్యక్షులు శ్రీ పొద్దుటూరి సంపత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం విజయవంతంగా పూర్తయింది.
ఈ సందర్భంగా ఉప సర్పంచ్ సంపత్ రెడ్డి మాట్లాడుతూ పిల్లల ఆరోగ్యమే మన బాధ్యత అని, ప్రతి ఒక్కరూ విధిగా ఈ మందులు వేయించుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి అరుణ, అంగన్వాడీ టీచర్ గంగమణి, ఆశ వర్కర్ దేవిక పాల్గొన్నారు.












