సూళ్లూరుపేట, 21 July
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యవసరంగా డయాలసిస్ సెంటర్ను ఏర్పాటు చేయాలని తిరుపతి జిల్లా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బాల గురవం బాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న రోగులు డయాలసిస్ కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని, దీనివల్ల వారికి తీవ్ర ఆర్థిక భారం, ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యవసరంగా డయాలసిస్ సెంటర్ను ఏర్పాటు చేయాలని తిరుపతి జిల్లా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బాల గురవం బాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న రోగులు డయాలసిస్ కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని, దీనివల్ల వారికి తీవ్ర ఆర్థిక భారం, ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని వెంటనే డయాలసిస్ సెంటర్ను ప్రారంభించాలని కోరారు.
ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోకపోతే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజలతో కలిసి ఆందోళనలు, ధర్నాలు నిర్వహిస్తామని బాల గురవం బాబు హెచ్చరించారు. ప్రభుత్వం ప్రజల ఆరోగ్య అవసరాలకు ప్రాధాన్యత ఇచ్చి వెంటనే చర్యలు చేపట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు దేవదానం, రమేష్ రెడ్డి (కాంగ్రెస్ పార్టీ తిరుపతి పార్లమెంట్ జనరల్ సెక్రెటరీ), భాస్కరరావు (స్టేట్ ఓబీసీ జనరల్ సెక్రెటరీ), మావుడురు వెంకటాచలపతి (సూళ్లూరుపేట నియోజకవర్గ ఇన్చార్జ్), సునీల్ రెడ్డి (కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షులు), మహిళా నాయకులు శ్వేత, చాముండేశ్వరి మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.












