హైదరాబాద్, 2026-06-05
బాసింగ బలాలే ఫేమ్ నటుడు ఈశ్వర్ సాయి, మరో నటికి సంబంధించిన వివాదంలోకి తనను అనవసరంగా లాగుతున్నారని ఫోక్ యాక్ట్రెస్ వైష్ణవి సోనీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వివాదంలో తన పేరును ప్రస్తావించవద్దని ఆమె విజ్ఞప్తి చేశారు.

సోషల్ మీడియాలో స్పందన
ఈ విషయంపై వైష్ణవి సోనీ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా స్పందించారు. దయచేసి నన్ను ఈ వివాదంలోకి లాగకండి. పాట లేదా వీడియో ఆధారంగా నాపై ఎలాంటి కథనాలు సృష్టించవద్దు. నా పని నేను చేసుకుంటున్నాను. వేరే వారి వ్యక్తిగత జీవితాలతో నాకు ఎలాంటి సంబంధం లేదు అని ఆమె పేర్కొన్నారు.
ప్రైవసీని గౌరవించండి
తన క్యారెక్టర్‌పై వ్యాఖ్యలు చేసే హక్కు ఎవరికీ లేదని, తన గోప్యతను గౌరవించాలని వైష్ణవి సోనీ ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా విజ్ఞప్తి చేశారు. ఈ వివాదానికి, తనకు ఎలాంటి సంబంధం లేదని ఆమె స్పష్టం చేశారు.