తానూర్, 2026-06-05
తానూర్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల ()లో ఉచిత వాటర్ ప్లాంట్‌ను ప్రజా ట్రస్ట్ చైర్మన్ మోహన్‌రావు పాటిల్ తన చేతుల మీదుగా ప్రారంభించారు. విద్యార్థినుల కోరిక మేరకు ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.
తానూర్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల ()లో ఉచిత వాటర్ ప్లాంట్‌ను ప్రజా ట్రస్ట్ చైర్మన్ మోహన్‌రావు పాటిల్ తన చేతుల మీదుగా ప్రారంభించారు. గత సంవత్సరం మోహన్‌రావు పాటిల్ ప్రజా ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆల్ ఇన్ వన్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా, లో చదువుకునే బాలికలు తమకు మంచి తాగునీటి సదుపాయం కల్పించాలని చైర్మన్ మోహన్‌రావు పాటిల్‌ను కోరారు. విద్యార్థినుల కోరికను మనస్ఫూర్తిగా స్వీకరించిన చైర్మన్ తప్పకుండా తాగునీటి సదుపాయం కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఉచిత వాటర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసి, ఈ రోజు ప్రారంభించారు.
ప్రజా ట్రస్ట్ సేవలు
అదే విధంగా ప్రజా ట్రస్ట్ చైర్మన్ మోహన్ రావు పటిల్ మాట్లాడుతూ, అత్యవసర సమయంలో ప్రజా ట్రస్ట్ అండగా ఉంటుందని తెలిపారు. తన ముధోల్ నియోజకవర్గ ప్రాంతంలోని సోదర, సోదరీమణుల కుటుంబాల్లో అగ్ని ప్రమాదం, పాము కాటు, పిడుగు, షార్ట్ సర్క్యూట్, వరదలు వంటి ప్రమాదాలు జరిగినప్పుడు ప్రజా ట్రస్ట్ తప్పకుండా అండగా నిలుస్తుందని తెలిపారు.
విద్యా రంగంలో ప్రోత్సాహం
అదే విధంగా, విద్య పరంగా తన నియోజకవర్గ అభ్యర్థులు ముందుండాలనే ఉద్దేశంతో, ఇటీవల విడుదలైన కానిస్టేబుల్ / ఉద్యోగాల కోసం అనుభవజ్ఞులైన అధ్యాపకులతో కోచింగ్ సెంటర్‌ను కూడా ప్రారంభించినట్లు తెలిపారు. తన ముధోల్ నియోజకవర్గంలో బాసర సరస్వతి అమ్మవారి క్షేత్రం ఉన్న ప్రాంతంలో చదువు పరంగా ఎవరూ వెనుకబడకూడదనే లక్ష్యంతో విద్యా రంగానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. తాము ఏర్పాటు చేసిన స్టడీ సెంటర్లో ఇప్పటి వరకు 19 మంది అభ్యర్థులు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారని తెలిపారు.
పాల్గొన్న ప్రముఖులు
ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల ప్రిన్సిపాల్ అలేఖ్య, తానూర్ మండల సర్పంచ్ సునంద పటిల్, శివాజీ పటిల్, బామ్ని సర్పంచ్ గణేష్ బొంద్రట్, సర్పంచ్ రవీందర్ పటిల్, ఎల్వంత్ సర్పంచ్ సురేష్ బోల్సా, ఉప సర్పంచ్ రాందాస్ పటిల్, భైంసా కౌన్సిలర్ దిలీప్, మాజీ ఎంపీపీ సుభాష్ జాదవ్, మండల ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, మండల నాయకులు పాల్గొన్నారు.












