ఆదిలాబాద్, 2026-06-05
నిర్మల్ జిల్లా నిర్మల్ ఆగస్టు 24 (మనోరంజని తెలుగు టైమ్స్) నిర్మల్ జిల్లా నిర్మల్ ఆగస్టు 24 (మనోరంజని తెలుగు టైమ్స్) పాలిటెక్నిక్ డిప్లమా కోర్సులను ఐటీఐఏటీసీలతో అనుసంధానం చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేయాలని, విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆపాలని తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ () ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వద్ద విద్యార్థులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జీవో కాపీలను దగ్ధం చేశారు.
నిర్మల్ జిల్లా నిర్మల్ ఆగస్టు 24 (మనోరంజని తెలుగు టైమ్స్)
పాలిటెక్నిక్ డిప్లమా కోర్సులను ఐటీఐఏటీసీలతో అనుసంధానం చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేయాలని, విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆపాలని తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ () ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వద్ద విద్యార్థులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జీవో కాపీలను దగ్ధం చేశారు.
ప్రభుత్వ నిర్ణయంపై అభ్యంతరం
ఈ సందర్భంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు కొట్టూరి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ () పేరుతో తీసుకువస్తున్న విధానాల ద్వారా పాలిటెక్నిక్ డిప్లమా కోర్సులను ఐటీఐఏటీసీలతో అనుసంధానం చేయడం విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీసే నిర్ణయమని అన్నారు. పాలిటెక్నిక్ విద్య అనేది ప్రత్యేకమైన సాంకేతిక విద్యా వ్యవస్థ అని, దాని ప్రమాణాలను మరింత పెంచాల్సిన ప్రభుత్వం అందుకు భిన్నంగా డిప్లమా కోర్సులను ఇతర శిక్షణా కోర్సులతో అనుసంధానం చేయడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
వ్యవస్థను బలహీనపరిచే ప్రయత్నాలు
అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ పేరుతో సాంకేతిక విద్యా వ్యవస్థలో మార్పులు తెచ్చి, స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ () వ్యవస్థను బలహీనపరిచే ప్రయత్నాలను ప్రభుత్వం నిలిపివేయాలని కొట్టూరి ప్రవీణ్ కుమార్ కోరారు.
నైపుణ్య శిక్షణకే పరిమితం చేయొద్దు
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన జాతీయ విద్యా విధానం (-2020) ప్రకారం విద్యను కేవలం నైపుణ్య శిక్షణకు పరిమితం చేసే విధానాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకూడదని నాయకులు స్పష్టం చేశారు. పాలిటెక్నిక్ విద్యార్థులకు ఉన్నత విద్య, ఇంజనీరింగ్ విద్య మరియు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
మౌలిక వసతులు, అధ్యాపకుల ఖాళీలు భర్తీ చేయాలి
జీవో నం. 97ను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని, పాలిటెక్నిక్ డిప్లమా కోర్సులను మరింత బలోపేతం చేయాలని, కళాశాలల్లో మౌలిక వసతులు, ప్రయోగశాలలు, అధ్యాపకుల ఖాళీల భర్తీ మరియు విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలను కల్పించాలని నాయకులు కోరారు.












