హైదరాబాద్, 2026-06-05
నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలోని ఎస్.పి.ఆర్ హైస్కూల్ విద్యాశాఖ నిబంధనలు, కమర్షియల్ కోర్టు నిషేధాజ్ఞలను ఉల్లంఘిస్తోందని రైట్ టు ఇన్ఫర్మేషన్ సర్వీస్ సొసైటీ (ఆర్.టి.ఐ.ఎస్.ఎస్) ఆరోపించింది. ఈ నేపథ్యంలో, ఆర్.టి.ఐ.ఎస్.ఎస్ జాతీయ అధ్యక్షుడు కేతావత్ బాబురామ్ నాయక్ నేతృత్వంలోని బృందం హైదరాబాద్‌లో స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్, రీజినల్ జాయింట్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ (ఆర్.జె.డి.ఎస్.ఇ)లకు వినతిపత్రాలు అందజేసింది. ఫిర్యాదుపై వెంటనే స్పందించిన ఆర్.జె.డి.ఎస్.ఇ, పాఠశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలోని ఎస్.పి.ఆర్ హైస్కూల్ (మెసర్స్ సర్వేపల్లి రాధాకృష్ణ ఎడ్యుకేషనల్ సొసైటీ) విద్యాశాఖ నిబంధనలు, కమర్షియల్ కోర్టు నిషేధాజ్ఞలను ఉల్లంఘిస్తోందని రైట్ టు ఇన్ఫర్మేషన్ సర్వీస్ సొసైటీ (ఆర్.టి.ఐ.ఎస్.ఎస్) ఆరోపించింది. ఈ నేపథ్యంలో, ఆర్.టి.ఐ.ఎస్.ఎస్ జాతీయ అధ్యక్షుడు కేతావత్ బాబురామ్ నాయక్ నేతృత్వంలోని బృందం హైదరాబాద్‌లో స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్, రీజినల్ జాయింట్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ (ఆర్.జె.డి.ఎస్.ఇ)లకు వినతిపత్రాలు అందజేసింది. ఫిర్యాదుపై వెంటనే స్పందించిన ఆర్.జె.డి.ఎస్.ఇ, పాఠశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని బాబురామ్ నాయక్ తెలిపారు.
చట్టవిరుద్ధంగా బ్రాండ్ నేమ్ వాడకం, అడ్మిషన్లు
కమర్షియల్ కోర్టు, విద్యాశాఖ ఆదేశాల ప్రకారం ఎస్.పి.ఆర్ బ్రాండ్ నేమ్‌ను ఉపయోగించడం చట్టవిరుద్ధమని స్పష్టంగా తెలిసినా, పాఠశాల యాజమాన్యం దానిని బేఖాతరు చేస్తూ అడ్మిషన్లు, తరగతులు నిర్వహిస్తోందని బాబురామ్ నాయక్ విమర్శించారు. ఇది విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడటమేనని ఆయన అన్నారు.
హాస్టల్ భద్రతపై అనుమానాలు
అంతేకాకుండా, ఫైర్ సేఫ్టీ అనుమతులు, సంక్షేమ శాఖ అనుమతులు లేకుండానే అక్రమంగా బాలుర హాస్టల్‌ను నడుపుతూ విద్యార్థుల భద్రతను తీవ్ర ప్రమాదంలోకి నెడుతున్నారని బాబురామ్ నాయక్ ఆరోపించారు. సరైన అనుమతులు లేని హాస్టల్ కార్యకలాపాలు విద్యార్థుల ప్రాణాలకు ముప్పు తెచ్చే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ఎఫ్.టి.ఎల్ పరిధిలో నిర్మాణాలు, మోసపూరిత ప్రచారం
స్థానిక చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్ (ఎఫ్.టి.ఎల్) / బఫర్ జోన్ పరిధిలో పాఠశాల, హాస్టల్ భవనాలు నిర్మించడం వాల్టా (డబ్ల్యూ.ఎ.ఎల్.టి.ఎ) చట్టాన్ని ఉల్లంఘించడమేనని, అలాగే గవర్నమెంట్ ఆర్డర్ (జి.ఓ) నెంబర్ 91కి విరుద్ధంగా ఐ.ఐ.టి - జె.ఇ.ఇ, ఒలింపియాడ్, కాన్సెప్ట్ వంటి పదాలతో కరపత్రాలు, ఫ్లెక్సీల ద్వారా మోసపూరిత ప్రచారాలు చేస్తున్నారని బాబురామ్ నాయక్ వివరించారు. ఇది విద్యార్థులను, తల్లిదండ్రులను తప్పుదోవ పట్టించే ప్రయత్నమని ఆయన అన్నారు.
ఆర్.టి.ఐ.ఎస్.ఎస్ డిమాండ్లు
ఈ నేపథ్యంలో, ఆర్.జె.డి.ఎస్.ఇ గారు తెలిపిన విధంగా తక్షణమే క్షేత్రస్థాయి విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, అధికారికంగా నేమ్ ఛేంజ్ అప్రూవల్ జరిగే వరకు కొత్త అడ్మిషన్లు, తరగతులను నిలిపివేయాలని ఆర్.టి.ఐ.ఎస్.ఎస్ డిమాండ్ చేసింది. అనుమతులు లేని నివాస హాస్టల్‌ను వెంటనే సీజ్ చేయాలని, ఎఫ్.టి.ఎల్ పరిధిలోని భవనాలకు అక్రమ అనుమతులు ఇచ్చిన అధికారులపై విజిలెన్స్ విచారణ జరిపించాలని కోరింది.












