కొమురం భీం ఆసిఫాబాద్ (మనోరంజని తెలుగు టైమ్స్) ఆగస్టు 06
తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఇటీవల విడుదల చేసిన నోటిఫికేషన్ లో 5వ షెడ్యూల్ ఏజెన్సీ ప్రాంత నిరుద్యోగ ఆదివాసీ యువతకు అన్యాయం జరుగుతోందని, 75 రిజర్వేషన్లు వర్తింపజేయాలని ఆదివాసి హక్కుల పోరాట సమితి (తుడుందెబ్బ) కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షులు కోవ విజయ్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం జిల్లా ఎస్పీకి వినతి పత్రం సమర్పించారు.
తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఇటీవల విడుదల చేసిన నోటిఫికేషన్ ( . 189/./.2/2026, తేది: 29 జూలై 2026) లో రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ ఏజెన్సీ ప్రాంత నిరుద్యోగ ఆదివాసీ యువతకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, తక్షణమే నిబంధనల ప్రకారం 75 కేటాయింపులు వర్తింపజేసి న్యాయం చేయాలని ఆదివాసి హక్కుల పోరాట సమితి (తుడుందెబ్బ) కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షులు కోవ విజయ్ కుమార్ డిమాండ్ చేశారు. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ మేడం గారిని తుడుందెబ్బ ప్రతినిధుల బృందంతో కలిసి వినతి పత్రం సమర్పించారు.
నిబంధనల అమలుపై విజ్ఞప్తి
ఈ సందర్భంగా తుడుందెబ్బ జిల్లా అధ్యక్షులు కోవ విజయ్ కుమార్ మాట్లాడుతూ, జీవో నంబర్ 109 () (తేది: 17.06.1988), జీవో నంబర్ 30 (, తేది: 11.07.2019) మరియు తెలంగాణ రాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్ సర్వీస్ రూల్స్ గెజెట్ నోటిఫికేషన్ (తేది: 10.05.2018) లలోని నిబంధనల ప్రకారం 5వ షెడ్యూల్ ఏజెన్సీ ప్రాంతాలలో 75 ఉద్యోగాలను స్థానిక గిరిజనులకే కేటాయించాల్సి ఉందన్నారు. గతంలో 2015, 2018 మరియు 2022 నోటిఫికేషన్లలో కూడా ఈ నిబంధనల ప్రకారమే అభ్యర్థులకు న్యాయం జరిగిందని గుర్తుచేశారు.
ప్రస్తుత నోటిఫికేషన్‌పై ఆందోళన
అయితే, ప్రస్తుత నోటిఫికేషన్లో జనరల్ జీవోల ప్రకారం పోస్టులను ఇవ్వడం వల్ల ఏజెన్సీ ప్రాంత ఆదివాసీ అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కావున రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్‌ను పరిగణనలోకి తీసుకొని, జీవో నంబర్ 24 ప్రకారం నిర్వహణ అనంతరం ఏజెన్సీ సర్టిఫికేట్ ఆధారంగా స్థానిక ఆదివాసీలతోనే ఈ ఖాళీలను భర్తీ చేయాలని కోరారు.
ఎస్పీ సానుకూల స్పందన
వినతి పత్రాన్ని స్వీకరించిన జిల్లా ఎస్పీ మేడం గారు సానుకూలంగా స్పందించారు. గిరిజన అభ్యర్థుల సమస్యల తీవ్రతను గుర్తించి, ఈ వినతి పత్రాన్ని మరియు నివేదికను వెంటనే సంబంధిత పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని, తదుపరి చర్యల కోసం పై అధికారులకు పంపిస్తానని హామీ ఇచ్చారు.
పాల్గొన్న నాయకులు
ఈ కార్యక్రమంలో విద్యార్ది సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఆత్రం అర్జున్, రాయ్ సెంటర్ పెద్దలు ఆత్రం ఆనంద్ రావ్, కుంరం శ్యాంరావ్, మరియు తుడుందెబ్బ నాయకులు, ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.












