బోథ్ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 01
ప్రైవేట్ పాఠశాలల్లో పుస్తకాలు, నోటు పుస్తకాలు, దుస్తుల విక్రయాలు, అధిక ఫీజుల వసూళ్లను అరికట్టాలని డిమాండ్ చేస్తూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఆధ్వర్యంలో మండల విద్యాశాఖ అధికారికి వినతిపత్రం సమర్పించారు. కొన్ని పాఠశాలలు విద్యార్థులకు అవసరమైన పుస్తకాలు, యూనిఫాంలను పాఠశాల ఆవరణలోనే విక్రయిస్తూ తల్లిదండ్రులపై ఆర్థిక భారం మోపుతున్నాయని ఏబీవీపీ నాయకుడు బోయిడి ఆకాశ్ ఆరోపించారు.
ప్రైవేట్ పాఠశాలల్లో పుస్తకాలు, నోటు పుస్తకాలు, దుస్తుల విక్రయాలు, అధిక ఫీజుల వసూళ్లను అరికట్టాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఆధ్వర్యంలో మండల విద్యాశాఖ అధికారికి వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకుడు బోయిడి ఆకాశ్ మాట్లాడుతూ, కొన్ని ప్రైవేట్ పాఠశాలలు విద్యార్థులకు అవసరమైన పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, యూనిఫాంలను పాఠశాల ఆవరణలోనే విక్రయిస్తూ తల్లిదండ్రులపై అదనపు ఆర్థిక భారం మోపుతున్నాయని ఆరోపించారు.
తల్లిదండ్రులకు బయట మార్కెట్లో కొనుగోలు చేసుకునే అవకాశం ఇవ్వకుండా పాఠశాలల నుంచే కొనుగోలు చేయాలని ఒత్తిడి చేయడం నిబంధనలకు విరుద్ధమని తెలిపారు. దీనిపై అధికారులు వెంటనే విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
అదేవిధంగా ఉన్నత స్థాయి ప్రవేశ పరీక్షల పేరుతో మూడో తరగతి విద్యార్థులకు కూడా అదనపు కోర్సులు నిర్వహిస్తూ అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారనే ఫిర్యాదులు ఉన్నాయని తెలిపారు. చిన్నారులకు ఇలాంటి కోర్సుల అవసరంపై విద్యాశాఖ సమగ్రంగా పరిశీలించాలని, తల్లిదండ్రులపై ఆర్థిక భారం పడకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ, విద్యార్థుల ప్రయోజనాల పరిరక్షణకు అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో రాహుల్, జస్వంత్, బింటు, సుకుమార్ తదితరులు పాల్గొన్నారు.












