నిర్మల్, జూలై 15
ైాబాలోిగచచిబౌలిఇడోసటేడియలోఏపిల26జిగిగిిసవలడిాడటెపటలోిమలజిలలాచెిలగవియాథలవిజయవతగాపాలగొా.ఈాయమలోమొతత1,212మిపాలగొా.వియాథలతమసటిఫిెటల,మెడలససవీిచా.
హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ఏప్రిల్ 26న జే.ఆర్. ఇంటర్నేషనల్ తైక్వాండో అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అటెంప్ట్‌లో మొత్తం 1,212 మంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ జిల్లాకు చెందిన ఎస్.ఆర్. డిజి స్కూల్ మరియు ఎస్.ఆర్. ప్రైమ్ స్కూల్ విద్యార్థులు హర్షిత్ (3వ తరగతి), ఆదిత్య కృష్ణ (9వ తరగతి), ప్రశాంత్ (9వ తరగతి), శేషాంత్ (8వ తరగతి) విజయవంతంగా పాల్గొని గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అటెంప్ట్ సర్టిఫికెట్లు మరియు మెడల్స్‌ను అందుకున్నారు.
నేడు (జూలై 15) స్థానిక శాసనసభ్యులు శ్రీ ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో విద్యార్థులు తమ సర్టిఫికెట్లు, మెడల్స్‌ను స్వీకరించారు. ఈ సందర్భంగా విద్యార్థులను వారి చైర్మన్ వరదా రెడ్డి గారు, డైరెక్టర్ సంతోష్ రెడ్డి గారు, డీజీఎం గోవర్ధన్ రెడ్డి గారు, జోనల్ మేడమ్ శిరీష మేడమ్ గారు, ఎస్.ఆర్. డిజి స్కూల్ ప్రిన్సిపాల్ అర్చన మేడమ్ గారు, ఎస్.ఆర్. ప్రైమ్ స్కూల్ ప్రిన్సిపాల్ సుధాకర్ గారు, కోచ్ చిరంజీవి మరియు పాఠశాల యాజమాన్యం అభినందిస్తూ, విద్యార్థులు భవిష్యత్తులో మరిన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయి విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.












