ఖానాపూర్, జూలై 2026
నిర్మల్ జిల్లా ఎల్ఎఫ్ఎల్ ప్రధానోపాధ్యాయుల ఫోరం జిల్లా ఎన్నికలు జిల్లా కేంద్రంలోని జమె రాత్పేట్ ఉన్నత పాఠశాలలో బుధవారం జరిగాయి. ఈ ఎన్నికల్లో షేక్ షబ్బీర్ అలీ గౌరవ అధ్యక్షులుగా, కారిగం ప్రవీణ్ కుమార్ అధ్యక్షులుగా, సామ దేవేందర్ రెడ్డి ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
నిర్మల్ జిల్లా ఎల్ఎఫ్ఎల్ ప్రధానోపాధ్యాయుల ఫోరం జిల్లా ఎన్నికలు జిల్లా కేంద్రంలోని జమె రాత్పేట్ ఉన్నత పాఠశాలలో బుధవారం జరిగాయి. ఈ ఎన్నికల్లో గౌరవ అధ్యక్షులుగా షేక్ షబ్బీర్ అలీ, అధ్యక్షులుగా కారిగం ప్రవీణ్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా సామ దేవేందర్ రెడ్డి ఎన్నికయ్యారు.
జిల్లా అసోసియేట్ అధ్యక్షులుగా చంద్రశేఖర్, గట్టు శ్రీనివాసులు ఎంపికయ్యారు. అదేవిధంగా ఉపాధ్యక్షులుగా గంగాచరణ్, ఉమలు ఎన్నిక కాగా కార్యదర్శులుగా రోహిదాస్, జలజ లు ఎంపికయ్యారు. కోశాధికారిగా భూమన్నలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా పలువురు ఎల్ఎఫ్ఎల్ ప్రధానోపాధ్యాయులు ఆయా సమస్యలపై చర్చించారు. చర్చల అనంతరం ఎల్ఎఫ్ఎల్ హెడ్మాస్టర్లకు గెజిటెడ్ హోదాను ప్రకటించాలని, పాఠశాలల సముదాయ ఇన్చార్జిలుగా ఎల్ఎఫ్ఎల్ ప్రధానోపాధ్యాయుల కు అప్పజెప్పాలని, జివో 25 ను తక్షణం ఉపసంహరించుకోవాలని తీర్మాలను ప్రవేశపెట్టగా అందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. జిల్లాలో కార్యవర్గం ఏర్పడడం ఇదే మొదటిసారి.












