ఖానాపూర్, జూలై 22
ఖానాపూర్ మండలంలోని బీర్ నంది ఉన్నత పాఠశాలను ఎంపీడీవో రాధా రాథోడ్ బుధవారం ఆకస్మికంగా సందర్శించి, పాఠశాల నిర్వహణ, విద్యార్థుల హాజరు, మధ్యాహ్న భోజనం వంటి అంశాలను పర్యవేక్షించారు. విద్యార్థులకు ప్రేరణ కలిగించి, ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు.
ఖానాపూర్ మండలంలోని బీర్ నంది ఉన్నత పాఠశాలను ఖానాపూర్ ఎంపీడీవో రాధా రాథోడ్ బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఉపాధ్యాయుల హాజరు, విద్యార్థుల హాజరు, ఎఫ్ ఆర్ ఎస్ నిర్వహణ, మధ్యాహ్న భోజనం వంటి అంశాలను ఆమె పర్యవేక్షించారు.
మధ్యాహ్న భోజన కార్మికులతో మాట్లాడుతూ, వర్షాకాలంలో పరిశుభ్రమైన నీటిని వాడాలని, వంట పాత్రలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. వంటగదిని ప్రతిరోజూ బూజు, చెత్త లేకుండా శుభ్రంగా ఉంచాలని సూచనలు ఇచ్చారు.
అనంతరం పదవ తరగతి తరగతి గదిని సందర్శించి, విద్యార్థుల సంఖ్యను పరిశీలించారు. ప్రతిరోజూ తప్పకుండా పాఠశాలకు రావాలని విద్యార్థులకు సూచించారు. ఈ ఏడాది పరీక్షల్లో 10/10 మార్కులతో పాఠశాలలో 100% ఉత్తీర్ణులవ్వాలని విద్యార్థులకు ప్రేరణ కలిగించారు.
ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు జి.ఎ.ల్.వి. ప్రసాద్, కొల్లం గూడ సర్పంచ్ అర్జున్, ఉపాధ్యాయులు ప్రకాష్, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం ఎంపీడీవో రాధా రాథోడ్ ను శాలువాతో సన్మానించారు.












