ఖమ్మం, 2026-08-06
ఖమ్మం రైల్వే స్టేషన్ పరిధిలో ప్రభుత్వ మహిళా కళాశాల విద్యార్థినులపై ప్లాట్‌ఫామ్ టికెట్ లేదనే కారణంతో జరిమానాలు విధించవద్దని, వేధించవద్దని జార్జిరెడ్డి , విద్యార్థి సంఘాల ప్రతినిధులు రైల్వే స్టేషన్ మేనేజర్‌ను కోరారు. ఈ సమస్యపై వారు మేనేజర్‌తో చర్చించి, విద్యార్థినులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఖమ్మం రైల్వే స్టేషన్‌కు ఆనుకుని ఉన్న ప్రభుత్వ మహిళా జూనియర్, డిగ్రీ కళాశాల విద్యార్థినులకు రైల్వే ప్లాట్‌ఫామ్ టికెట్ లేదనే కారణంతో జరిమానాలు విధించవద్దని, వేధించవద్దని జార్జిరెడ్డి , ప్రతినిధులు రైల్వే స్టేషన్ మేనేజర్‌ను కోరారు. కళాశాలకు వెళ్లే క్రమంలో విద్యార్థినులు రైల్వే స్టేషన్ ఫుట్‌పాత్ బ్రిడ్జి ప్లాట్‌ఫామ్ మీదుగా వెళ్లాల్సి వస్తోందని, ఈ నేపథ్యంలో వారిపై జరిమానాలు విధించడం, గుంజీలు తీయించడం వంటివి చేస్తున్నారని తెలిసిన వెంటనే విద్యార్థి సంఘాల ప్రతినిధులు స్పందించారు.
విద్యార్థి సంఘాల ఆందోళన
ఉమెన్స్ జూనియర్, డిగ్రీ కళాశాలల్లో చదువుకునే వందలాది మంది విద్యార్థులు ఏళ్ల తరబడి ఈ మార్గాన్నే ఉపయోగిస్తున్నారని, రైల్వే చట్టాలు మారాయని, రూల్స్ మారాయని చెబుతూ కళాశాలకు వెళ్లేటప్పుడు, వచ్చేటప్పుడు ప్లాట్‌ఫామ్ టికెట్ లేదనే కారణంతో విద్యార్థులను ఆపి జరిమానా కట్టాలని వేధించడం, కట్టకపోతే గుంజీలు తీయిస్తామని బెదిరించడం ఏ చట్టాల కిందకు వస్తుందని విద్యార్థి సంఘాల ప్రతినిధులు ప్రశ్నించారు. రైల్వే స్టేషన్ పక్కన కళాశాలలు నడుస్తున్నప్పుడు, విద్యార్థులు ప్లాట్‌ఫామ్ నుంచి అటుఇటు దాటటానికి రైల్వే అధికారులు సంబంధిత కళాశాలల ప్రిన్సిపాల్లతో కలిసి పాస్‌లు అందించాల్సిన బాధ్యత రైల్వే చట్టాల్లో ఉందని, దానితో పాటు ఫుట్‌పాత్ బ్రిడ్జిలను ఏర్పాటు చేయాలని కూడా చట్టాల్లో ఉందని వారు గుర్తు చేశారు.
మేనేజర్ సానుకూల స్పందన
విద్యార్థి సంఘాల ప్రతినిధుల విజ్ఞప్తికి ఖమ్మం రైల్వే స్టేషన్ మేనేజర్ సానుకూలంగా స్పందించారు. ఇలాంటి పరిస్థితి మళ్లీ పునరావృతం కాకుండా అవసరమైన చర్యలు తీసుకుంటామని, ప్రభుత్వ మహిళా డిగ్రీ, జూనియర్ కళాశాల విద్యార్థినులకు ఇబ్బందులు కలగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. అలాగే విద్యార్థులపై ఎలాంటి జరిమానాలు విధించకుండా సంబంధిత సిబ్బందికి తగిన సూచనలు చేస్తామని తెలిపారు.
ప్రతినిధుల బృందం
ఈ సందర్భంగా , జార్జిరెడ్డి విద్యార్థి సంఘాల ప్రతినిధి బృందంలో కృష్ణవేణి, హర్షిత, వర్ధిని, అనూష, దివ్య, అఖిల, యక్షిత, స్పందన, సౌమ్య, రాజేశ్వరి, మహమూదా, రుక్సానా, ఉష, కీర్తన, త్రిష, పూజిత, సాయిచరణ్య, నవ్య తదితరులు పాల్గొన్నారు. ఈ చర్చలో జార్జిరెడ్డి జిల్లా అధ్యక్షులు సురేష్, రాష్ట్ర సమన్వయకర్త జమ్మి అశోక్, జార్జిరెడ్డి జిల్లా గర్ల్స్ కన్వీనర్ పైండ్ల శ్యామల పాల్గొన్నారు.












