East Godavari/Anaparthy (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 22
ప్రభుత్వ పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా చదువుకు దూరం కాకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో విద్యాశాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన పలు కీలక సూచనలు చేశారు.
ప్రభుత్వ పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా చదువుకు దూరం కాకుండా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో విద్యాశాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన పలు కీలక సూచనలు చేశారు.
ప్రభుత్వ పాఠశాలల్లో బోధన, మౌలిక సదుపాయాలు, విద్యార్థుల హాజరు తదితర అంశాలపై సమీక్షించిన కలెక్టర్.. ఉపాధ్యాయులు, విద్యార్థులు ప్రతిరోజూ తప్పనిసరిగా ఎఫ్ఆర్ఎస్ ద్వారా హాజరు నమోదు చేయాలని సూచించారు. ఉపాధ్యాయుల హాజరు 90 శాతానికి తగ్గకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
నూతన విద్యార్థుల ఎఫ్ఆర్ఎస్ నమోదు, అపార్ (APAAR) ఐడీ నమోదు ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని, సాంకేతిక సమస్యలు ఉంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఆధార్ కార్డు లేని విద్యార్థులకు ఆధార్ నమోదు చేయించేలా చర్యలు చేపట్టాలన్నారు.
తరచూ బడికి గైర్హాజరయ్యే విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి వారిని తిరిగి పాఠశాలకు వచ్చేలా చొరవ చూపాలని, ప్రభుత్వ బడుల్లో డ్రాపౌట్ శాతం లేకుండా చూడాలని స్పష్టం చేశారు.
పూర్వ ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంచడంతో పాటు ఆధునిక బోధనా విధానాలు, బృంద చర్చలు, ఉపాధ్యాయ–విద్యార్థుల ముఖాముఖి కార్యక్రమాల ద్వారా వెనుకబడిన విద్యార్థులను ప్రోత్సహించాలని సూచించారు. తల్లిదండ్రులతో తరచూ సమావేశాలు నిర్వహిస్తూ విద్యార్థుల పురోగతిపై చర్చించాలని, పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి భోజన్న, మండల విద్యాశాఖ అధికారులు, కాంప్లెక్స్ హెచ్ఎంలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.












