*💥 (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 22
నీట్ (NEET-UG) పేపర్ లీక్ వ్యవహారాన్ని నిరసిస్తూ, ఢిల్లీలో విద్యార్థులకు మద్దతుగా ఆందోళన చేపట్టిన రాహుల్ గాంధీని అక్రమంగా అరెస్టు చేయడాన్ని, విద్యార్థులపై లాఠీ ఛార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగించడాన్ని నిరసిస్తూ నిర్మల్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు RDO ఆఫీస్ ఎదుట ధర్నా నిర్వహించి, దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ (NEET-UG) పేపర్ లీక్ వ్యవహారానికి వ్యతిరేకంగా, ఢిల్లీలో విద్యార్థులకు మద్దతుగా ఆందోళన చేపట్టిన లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని అక్రమంగా అరెస్టు చేయడాన్ని, విద్యార్థులపై లాఠీ ఛార్జ్ చేసి, టియర్ గ్యాస్ ప్రయోగించడాన్ని నిరసిస్తూ నిర్మల్ జిల్లా కేంద్రంలోని RDO ఆఫీస్ ఎదురుగా జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సమరసింహారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన (ధర్నా) కార్యక్రమం నిర్వహించి, దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని మోడీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో మాజీ మంత్రి వర్యులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, నిర్మల్ వైస్ చైర్మన్ అప్పల గణేష్ చక్రవర్తి, పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి, నిర్మల్ పట్టణ అధ్యక్షులు ఆకుల హరీష్, నిర్మల్ అసెంబ్లీ ప్రెసిడెంట్ సయ్యద్ అర్షద్, నిర్మల్ పట్టణ అధ్యక్షులు సాయిప్రతాప్ నాయుడు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులపై లాఠీ ఛార్జ్ చేయడం, టియర్ గ్యాస్ ప్రయోగించడం అమానుషమని, దీనికి బాధ్యత వహిస్తూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ప్రధాని మోడీ రాజీనామా చేయాలని కోరారు.
రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులను అక్రమంగా అరెస్టు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని విమర్శించారు. నీట్ పరీక్షల వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని, యువతకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని పేర్కొన్నారు.












