బీసీ గురుకుల పాఠశాల కు 40 సీలింగ్ ఫ్యాన్లు ట్యూబ్ లైట్ల బహుకరణ : 👉 భోగవల్లి సునీత మెమోరియల్ ఫౌండేషన్ చేయూత
మిర్యాలగూడ జూలై 7 (మనోరంజని తెలుగు టైమ్స్)
మిర్యాలగూడ మండలం శ్రీనివాసనగర్ గ్రామంలో గల బిసి గురుకుల పాఠశాల తరగతి గదులలో సీలింగ్ ఫ్యాన్ లేక పాఠశాల విద్యార్థినిలు ఇబ్బందులు పడుతున్నారనే విషయం తెలిసిన వెంటనే స్పందించిన గ్రామ మాజీ సర్పంచ్ భోగవల్లి వెంకటరమణ చౌదరి (బాబి) ఆధ్వర్యంలో మంగళవారం పాఠశాలకు 40 సీలింగ్ ఫ్యాన్లు, 8 ట్యూబ్ లైట్లను బహూకరించారు. భోగవల్లి సునీత మెమోరియల్ ఫౌండేషన్ నేతృత్వంలో పలు సేవా కార్యక్రమాలు చేయడంతో పాటు బీసీ గురుకుల పాఠశాల మౌలిక వసతుల కల్పనకు చేయూత అందించిన విషయం తెలిసిందే. గతంలో సుమారు రెండు లక్షల రూపాయలతో లైబ్రరీకి పుస్తకాలఅందించడంతోపాటు 100 ఫ్యాన్లు లను భోగవల్లి సునీత ఫౌండేషన్ ద్వారా అందించిన విషయం పాఠకులకు విధితమే. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ అనుకరణ లెక్చరర్స్, విద్యార్థినిలు పాల్గొన్నారు.












