వినుకొండ, శనివారం
పల్నాడు జిల్లా వినుకొండలోని శ్రీ గుంటి ఆంజనేయ స్వామి దేవాలయంలో నిజామాబాద్‌కు చెందిన జాదూ యుగంధర్ రంగనాథ్‌ను శనివారం ఘనంగా సత్కరించారు. ఆలయ అర్చకులు ఆనందాచార్యులు, ఆచార్య నారాయణ రామ్మోహన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రంగనాథ్ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడు జిల్లా, నరసారావుపేట రెవెన్యూ డివిజన్ పరిధిలోని చారిత్రక పట్టణమైన వినుకొండలో, శ్రీ గుంటి ఆంజనేయ స్వామి దేవాలయంలో నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన జాదూ యుగంధర్ రంగనాథ్‌ను ఘనంగా సన్మానించారు. ఆలయ అర్చకులు ఆనందాచార్యులు, ఆచార్య నారాయణ రామ్మోహన్ ఆధ్వర్యంలో ఈ సన్మాన కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా రంగనాథ్ మాట్లాడుతూ, "తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలను క్రీ.శ. 4, 7వ శతాబ్దాల మధ్య పరిపాలించిన విష్ణుకుండినుల ఘన చరిత్ర కలిగిన వినుకొండ గుంటి ఆంజనేయుని సన్నిధిలో నన్ను సన్మానించడం చాలా గర్వంగా ఉంది" అని అన్నారు. విష్ణుకుండినులు అమరపురం, ఇంద్రపాల నగరాలను రాజధానులుగా చేసుకొని, సంస్కృతాన్ని రాజభాషగా పరిపాలించారని, మహా రాజేంద్ర వర్మ (ఇంద్ర వర్మ) రాజ్యస్థాపకుడని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రముఖ ఆర్టిస్ట్ మద్దిరాల శివప్రసాద్, ప్రముఖ వ్యాపారవేత్త నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.












