** (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 03
రాజన్న సిరిసిల్ల జిల్లా విలాసాగర్ గ్రామ దేవత శ్రీ పోచమ్మ తల్లి నూతన విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు గోపూజ, గురువందనం, గణపతి పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామ వీధుల గుండా శోభాయాత్ర సాగింది.
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం విలాసాగర్ గ్రామ దేవత శ్రీ పోచమ్మ తల్లి నూతన విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాలు శుక్రవారం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు వైదిక పండితుల ఆధ్వర్యంలో గోపూజ, గురువందనం, గణపతి పూజలను నిర్వహించారు.
అనంతరం త్రిలింగ సంగమేశ్వర దేవాలయం నుంచి శ్రీ పోచమ్మ తల్లి నూతన విగ్రహాలను భక్తుల జయజయధ్వానాలు, మంగళ వాయిద్యాల నడుమ శోభాయాత్రగా పోచమ్మ దేవాలయానికి తీసుకువచ్చారు. గ్రామ వీధుల గుండా సాగిన శోభాయాత్రలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
దేవాలయానికి చేరుకున్న అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు, హారతులు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు.
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ఏనుగుల కనకయ్య మాట్లాడుతూ, గ్రామ ప్రజల సహకారంతో పోచమ్మ తల్లి నూతన విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. మూడు రోజుల పాటు జరిగే మహోత్సవాల్లో భక్తులందరూ పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని ఆయన కోరారు.











