మంచిర్యాల (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 13
జైపూర్ మండలం, వేలాల గ్రామంలోని గట్టు మల్లన్న సన్నిధిలో 13 జూలై, సోమవారం ఆరుద్ర నక్షత్రం సందర్భంగా 23వ గిరిప్రదక్షిణ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, భక్తులు పాల్గొన్నారు.
జైపూర్ మండలం, వేలాల గ్రామంలోని గట్టు మల్లన్న సన్నిధిలో 13 జూలై, సోమవారం ఆరుద్ర నక్షత్రం సందర్భంగా 23వ గిరిప్రదక్షిణ అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఈ గిరిప్రదక్షిణ అనంతరం, ఆలయ ప్రాంగణంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ అన్న ప్రసాద వితరణలో మంచిర్యాల జిల్లా మేయర్ ధరణి మధు, ఆయన కుటుంబ సభ్యులు, గాజర్ల శేఖర్, గాజర్ల సతీష్, బొద్దున నరేష్, బొద్దున సతీష్, ఇడ్ల రామస్వామి, అందే సదానందం పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వేలాల గ్రామ సర్పంచ్ డేగ స్వప్న నగేష్, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.











