లోకేశ్వరం, జూలై 12
నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండల కేంద్రంలో ఆదివారం గంగానీళ్ల జాతర భక్తిశ్రద్ధలతో, ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా ముగిసింది. విడీసీ (VDC) కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండల కేంద్రంలో గంగానీళ్ల జాతర ఆదివారం భక్తిశ్రద్ధలతో, ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా ముగిసింది. విడీసీ (VDC) కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ జాతరలో గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
జాతరలో భాగంగా గోదావరి నది నుంచి పవిత్ర గంగాజలాన్ని తీసుకువచ్చి గ్రామ దేవతలకు అభిషేకం నిర్వహించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని, సకాలంలో వర్షాలు కురిసి పాడిపంటలు సమృద్ధిగా పండాలని భక్తులు ప్రార్థించారు.
జాతరలో శివసత్తుల పూనకాలు, సంప్రదాయ నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గ్రామ వీధుల గుండా సాగిన ఊరేగింపులో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. భక్తుల సందడితో లోకేశ్వరం గ్రామం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.












