🕉️ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 04
తిరుమలలో భక్తుల రద్దీ తీవ్రంగా ఉంది. శనివారం వైకుంఠంలోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. ఉచిత సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోంది.
శనివారం తిరుమలలో భక్తుల రద్దీ గణనీయంగా పెరిగింది. వైకుంఠంలోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి, క్యూలైన్లు శిలాతోరణం వరకు విస్తరించాయి.
ప్రస్తుతం ఉచిత సర్వదర్శనానికి సుమారు 15 గంటలు, టైమ్ స్లాట్ (SSD) టోకన్ దర్శనానికి సుమారు 8 గంటలు, రూ. 300/- ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సుమారు 6 గంటల సమయం పడుతోంది.
శుక్రవారం, 03-07-2026న, స్వామివారిని 71,668 మంది భక్తులు దర్శించుకున్నారు. అదే రోజున 32,975 మంది భక్తులు తలనీలాలు సమర్పించగా, స్వామివారి హుండీ ఆదాయం రూ. 4.16 కోట్లుగా నమోదైంది.












