రామన్నపేట, ఆదివారం
వేల్పూర్ మండలంలోని రామన్నపేటలో వర్షాలు కురవాలని కోరుతూ అయ్యల గుట్ట ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం సలేంద్రాల కార్యక్రమం వైభవంగా జరిగింది. గోదావరి నది నుండి తెచ్చిన పవిత్ర జలాలతో గ్రామ దేవతలకు, ఆలయాలకు ప్రత్యేక పూజలు, జలాభిషేకాలు నిర్వహించారు.
వేల్పూర్ మండలంలోని రామన్నపేటలో వర్షాలు కురవాలనే ఆకాంక్షతో అయ్యల గుట్ట ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం సలేంద్రాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వేకువజామునే తడపాకల్ గోదావరి నది నుండి పవిత్ర జలాలను తెచ్చి, గ్రామంలోని అన్ని గ్రామ దేవతలు, దేవాలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించి జలాభిషేకం చేశారు.
గోదావరి జలాలను తెచ్చిన వారికి మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. పాటు మీది హన్మాన్ గుడి నుండి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
ఈ సందర్భంగా అయ్యలగుట్ట ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు రాజారపు శోభన్ మాట్లాడుతూ, సకాలంలో వర్షాలు కురువకపోవడంతో వరుణుడు కరుణించి వర్షాలు కురవాలనే సంకల్పంతో ఈ సలేంద్రాల కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు.
కార్యక్రమంలో అధ్యక్షుడు రాజారపు శోభన్, ఉపాధ్యక్షుడు గౌరి సంజీవ్, కోశాధికారి జంగిటి సాయన్న, సలహాదారులు ఎలుక శ్రీనివాస్ గౌడ్, కుర్మ నర్సయ్య, కమిటీ సభ్యులు, గ్రామదేవతల పూజారి ఎల్లక్కర్, వివిధ కుల సంఘాల నుండి వచ్చిన మహిళలు, పురుషులు, తదితరులు పాల్గొన్నారు.












