లోకేశ్వరం, 21 July
లోకేశ్వరం మండలంలోని రాజురా గ్రామంలో శ్రీ రామాలయ నిర్మాణానికి సుమారు 50 లక్షల రూపాయలు మంజూరయ్యాయి. ఈ మేరకు టెండర్ అప్రూవల్ కాపీని గ్రామస్తులకు అందజేశారు. త్వరలోనే పనులు ప్రారంభం కానున్నాయి.
లోకేశ్వరం మండలంలోని రాజురా గ్రామంలో మాజీ శాసనసభ్యులు శ్రీ జి. విఠల్ రెడ్డి పర్యటించారు. రాజుర గ్రామంలో శ్రీ రామాలయ నిర్మాణానికి సుమారు 50 లక్షల రూపాయలతో మంజూరు అయినట్లు ఆయన తెలిపారు. ఇందులో 40 లక్షలు CGF నిధులు కాగా, 10 లక్షలు గ్రామస్తుల డిపాజిట్ అని పేర్కొన్నారు.
రామాలయ నిర్మాణానికి సంబంధించిన టెండర్ అప్రూవల్ కాపీని ఈరోజు గ్రామస్తులకు అందజేయడం జరిగింది. త్వరలోనే అగ్రిమెంట్ చేసుకుని పనులు కూడా ప్రారంభించడం జరుగుతుందని ఆయన అన్నారు.
టెండర్ అప్రూవల్ చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండ సురేఖ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీ జూపల్లి కృష్ణారావులకు ముధోల్ నియోజకవర్గ ప్రజల తరఫున మాజీ శాసనసభ్యులు శ్రీ జి. విఠల్ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ శ్యామల, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్త గౌడ్, పిఎసిఎస్ చైర్మన్ రత్నాకర్ రావు, కాంగ్రెస్ పార్టీ జిల్లా వైస్ ప్రెసిడెంట్ నరసన్న, ఆత్మ చైర్మన్ నర్సారెడ్డి, పిఎసిఎస్ వైస్ చైర్మన్ గంగాధర్, మండల సర్పంచులు భుజంగ్ రావు, రాజశేఖర్ రావు, కపిల్ ఆలయ అధ్యక్షులు పతాని భూమన్న, లోలం చిన్నయ్య, మండల సీనియర్ నాయకులు సాయి రెడ్డి, గంగయ్య, రమేష్ గౌడ్, మాజీ సర్పంచ్ నరసయ్య, శ్రీనివాస్, అనిల్, సాయి, ప్రసాద్, కలీం, రోహిత్, అరల మోహన్, కురుమ పెంటన్న, ముజాహిద్ మరియు గ్రామస్తులు, యువకులు పాల్గొన్నారు.











