Nirmal/Lokeshwaram (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 21
లోకేశ్వరం మండలంలోని రాజురా గ్రామంలో శ్రీరామాలయ నిర్మాణానికి సంబంధించిన టెండర్ ఆమోద పత్రం గ్రామస్తులకు అందజేయబడింది. మాజీ ఎమ్మెల్యే జి. విఠల్ రెడ్డి మంగళవారం పర్యటించి, సుమారు రూ.50 లక్షల వ్యయంతో చేపట్టనున్న ఈ నిర్మాణానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని తెలిపారు.
లోకేశ్వరం మండలంలోని రాజురా గ్రామంలో నిర్మించనున్న శ్రీరామాలయానికి సంబంధించిన టెండర్ ఆమోద పత్రాన్ని గ్రామస్తులకు అందజేశారు. మాజీ శాసనసభ్యులు జి. విఠల్ రెడ్డి మంగళవారం ఈ సందర్భంగా గ్రామంలో పర్యటించారు. సుమారు రూ.50 లక్షల వ్యయంతో ఆలయ నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. ఇందులో రూ.40 లక్షలు కేంద్ర ప్రభుత్వ నిధులు, రూ.10 లక్షలు గ్రామస్తుల విరాళాలు ఉన్నాయని వివరించారు. త్వరలోనే ఒప్పంద ప్రక్రియ పూర్తి చేసి నిర్మాణ పనులను ప్రారంభిస్తామని పేర్కొన్నారు.
శ్రీరామాలయ నిర్మాణానికి నిధులు మంజూరు చేసి టెండర్‌కు ఆమోదం తెలిపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావులకు ముధోల్ నియోజకవర్గ ప్రజల తరఫున మాజీ ఎమ్మెల్యే జి. విఠల్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ శ్యామల, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ముత్త గౌడ్, సహకార సంఘం అధ్యక్షుడు రత్నాకర్ రావు, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు నరసన్న, ఆత్మ కమిటీ అధ్యక్షుడు నర్సారెడ్డి, గంగాధర్, భుజంగ్ రావు, ధార్వాడి కపిల్. రాజశేఖర్ రావు, పతాని భూమన్న, లోలం చిన్నయ్య, సాయి రెడ్డి, గంగయ్య, రమేష్ గౌడ్, నరసయ్య, శ్రీనివాస్, అనిల్, సాయి, ప్రసాద్, కలీం, రోహిత్, అరల మోహన్, కురుమ పెంటన్న, ముజాహిద్, గ్రామ పెద్దలు, యువకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.











