నిజామాబాద్, జూలై 17
నిజామాబాద్ నగరంలో శుక్రవారం శ్రీ జగన్నాథ రథయాత్ర జరగనుంది. ఈ సందర్భంగా సీతారాంనగర్ కాలనీకి చెందిన సీనియర్ న్యాయవాది ఎర్రం గణపతితో పాటు పలువురు ప్రముఖులకు ప్రభుజీలు ఆహ్వానం అందజేశారు. లోకకళ్యాణార్థం నిర్వహిస్తున్న ఈ రథయాత్రలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.
నిజామాబాద్ నగరంలో శుక్రవారం నిర్వహించనున్న శ్రీ జగన్నాథ రథయాత్రకు సీతారాంనగర్ కాలనీకి చెందిన సీనియర్ న్యాయవాది ఎర్రం గణపతితో పాటు పలువురు ప్రముఖులకు ప్రభుజీలు ఆహ్వానం అందజేశారు.
ఈ సందర్భంగా ప్రభుజీలు మాట్లాడుతూ, లోకకళ్యాణార్థం నిర్వహిస్తున్న జగన్నాథ రథయాత్రలో నగర ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీ జగన్నాథ స్వామిని దర్శించుకోవాలని కోరారు. రథయాత్ర మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమై నగరంలోని పలు ప్రధాన వీధుల గుండా భక్తుల నామసంకీర్తనల మధ్య సాగుతుందని తెలిపారు.
ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాది ఎర్రం గణపతి, జాతీయ మానవ హక్కుల కమిటీ జిల్లా అధ్యక్షుడు ధర్మేంద్ర మాల్వేకర్, జాతీయ మానవ హక్కుల సంఘం నగర అధ్యక్షుడు జె. లక్ష్మణ్‌లకు ప్రత్యేకంగా ఆహ్వానం అందజేశారు.
మహిళలు, పిల్లలు, పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొని జగన్నాథ స్వామి రథయాత్రను తిలకించి స్వామివారి ఆశీర్వాదాలు పొందాలని ప్రభుజీలు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎర్రం గణపతి, ధర్మేంద్ర మాల్వేకర్, జె. లక్ష్మణ్, ప్రభావతి, కేశవులు, మాధవి, జీజీ కళాశాల ఆచార్యురాలు బాలామణి తదితరులు పాల్గొన్నారు.












