లోకేశ్వరం, 1 August
లోకేశ్వరం మండల కేంద్రంలోని పెద్దమ్మతల్లి ఆలయ నాలుగో వార్షికోత్సవ వేడుకలు శనివారం భక్తిశ్రద్ధలతో, ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హోమాలు నిర్వహించారు. గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు.
భక్తి శ్రద్ధలతో, ఆధ్యాత్మిక వాతావరణంలో లోకేశ్వరం మండల కేంద్రంలోని పెద్దమ్మతల్లి ఆలయ నాలుగో వార్షికోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు.
వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని తెల్లవారుజాము నుంచే ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అమ్మవారికి పంచామృత అభిషేకాలు, ప్రత్యేక అలంకరణలు, హోమాలు నిర్వహించి మహా మంగళహారతి సమర్పించారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు.
గ్రామ మహిళలు భక్తి భావంతో అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రాంగణం భక్తుల జయజయధ్వానాలతో మార్మోగింది.
ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ... పెద్దమ్మతల్లి ఆశీస్సులతో గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, పాడిపంటలతో అభివృద్ధి చెందాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు.
పూజా కార్యక్రమాల అనంతరం అమ్మవారి ఊరేగింపు భక్తిశ్రద్ధలతో పోతరాజుల శివశక్తుల పూనకాలతో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో గ్రామ ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.












