ముథోల్ (మనోరంజని తెలుగు టైమ్స్) ఆగస్టు 10
లోకేశ్వరం మండల కేంద్రంలో మేర సంఘం ఆధ్వర్యంలో సంత్ నాందేవ్ మహారాజ్ 676వ పుణ్యతిథిని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాందేవ్ మహారాజ్ చిత్రపటానికి పూజలు నిర్వహించి, ఆయన సేవలను స్మరించుకున్నారు.

నాందేవ్ మహారాజ్ సేవలు
మేర సంఘం అధ్యక్షుడు శివ మాట్లాడుతూ నాందేవ్ మహారాజ్ భక్తి మార్గంలో చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. పండరీపూర్ విఠలేశ్వరుని మహిమలను నాందేవ్ మహారాజ్ ప్రజలకు చాటిచెప్పారని పేర్కొన్నారు. ఆయన ఆధ్యాత్మిక బోధనలు, భక్తి సందేశాలు సంఘ సభ్యులతో పాటు ప్రజలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయని తెలిపారు.
పాల్గొన్నవారు
ఈ కార్యక్రమంలో కోశాధికారి వినోద్, గంగాధర్, సాయన్న, మల్లేష్, సాయినాథ్, సంఘ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.